Bangladesh's tour of India appears to have hit yet another hurdle in the shape of a weather phenomenon, with Cyclone Maha expected to be in the vicinity of Rajkot on 7 November, the same day on which the city will play host to the second T20 International of the series.
#indiavsbanglades
#2ndt20i
#cyclonemaha
#indiatourofbangaldesh2019
#teamindia
#cricket
#indvsban

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 రాజ్ కోట్ వేదికగా నవంబర్ 7న జరగనుంది. అయితే, ఈ టీ20కి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ గుజరాత్, సౌరాష్ట్రకు భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. క్షణంలోనైనా అది పశ్చిమ గుజరాత్, సౌరాష్ట్రలవైపు దూసుకొచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫాన్‌కు "మహా" అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావం కారణంగా బుధవారం నుంచి గుజరాత్, సౌరాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.